![]() |
![]() |

"ఈ దీపావళికి మాస్ జాతర" రీసెంట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో అందాల పోటీలు కూడా పెట్టారు. ప్రకృతి కంభం, నైనికా వచ్చి స్టేజిని దడదడలాడించారు. ప్రకృతి ఐతే లంగా వోణిలో అచ్చ తెలుగు ఆడపిల్లలా వచ్చి స్టేజి మీద రాంప్ వాక్ చేసింది. "ఈ రౌండ్ జడ్జెస్ కి అన్నమాట. మీ ఇద్దరి జడ్జెమెంట్ ఒకేలా ఉందా లేదా అనేది" అంటూ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. ఇక ప్రకృతి ఐతే ఊపుకుంటూ, తిప్పుకుంటూ, హొయలు పోతూ రాంప్ వాక్ చేసింది.
ఇక తర్వాత నైనికా కూడా వచ్చి రాంప్ వాక్ చేసింది. తర్వాత శేఖర్ మాష్టర్ "ప్రకృతి 8 మార్క్స్. కాదు ఇంకోటి నడుముంది కదా అని మధ్యలో ఓ తిప్పేసుకోవడం కాదు. ఎంత వరకు తిప్పాలి ఎంత వరకు బాలన్స్ చేయాలి అనేది చూడాలి. నాగబాబు సర్ నమస్కారం చేసావ్. నాకు సెల్యూట్ కొడతావేంటి " అని అడిగాడు. "నన్నేదో పెద్దవాడిగా గుర్తించింది. నిన్ను యంగ్ బాయ్ గా గుర్తించింది ఆ అమ్మాయి." అని చెప్పారు నాగబాబు. "నన్ను కూడా పెద్దోడిలాగే గుర్తించొచ్చు కదా సర్" అని శేఖర్ మాష్టర్ అనేసరికి. "ఎందుకు నీకు రెండోదే కావాలి. నీకు ఏది కావాలో అదే ఇచ్చింది" అన్నారు నాగబాబు. నైనికాకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో చెప్పాలి అంటూ ప్రదీప్ అడిగేసరికి "నైనికాకు ఐతే తన నడకలో క్యాట్ వాక్ తో పాటు సంప్రదాయం కనపడింది" అన్నాడు శేఖర్ మాష్టర్ మార్కులు గురించి చెప్పకపోయేసరికి "ఎంతిచ్చావో చెప్పేహే" అంటూ నాగబాబు కౌంటర్ వేశారు.
![]() |
![]() |